దేశీ మార్కెట్లో వోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ లాంఛ్

న్యూఢిల్లీ : ఆటో ఎక్స్పో 2020లో ప్రదర్శించిన టైగన్ ఎస్‌యూవీని వోక్స్వ్యాగన్ భారత్‌లో లాంఛ్ చేసింది. త్వరలో మార్కెట్లో అందుబాటులో ఉండే ఈ ఎస్యూవీ ధర రూ 10.5 లక్షల (ఎక్స్ షోరూం)ని కంపెనీ వెల్లడించింది. కరోనా మహమ్మారి నెమ్మదించడంతో సేల్స్ ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్న పండుగ సీజన్లో టైగన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు వోక్స్వ్యాగన్ సన్నాహలు చేస్తోంది.

హ్యుండాయ్ క్రెటా, స్కోడా కుషక్, కియా సెల్టోస్, ఎంజీ ఆస్టర్లకు టైగన్ దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. టైగన్‌ను కూడా వోక్స్వ్యాగన్ ప్రత్యేకంగా భారత్ మార్కెట్‌కు అనుగుణంగా డెవలప్ చేసింది. టైగన్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా ఇప్పటివరకూ 12,221 ప్రీఆర్డర్లు లభించాయి.

10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం, డ్రైవింగ్ బిహేవియర్, లైవ్ ట్రాకింగ్, వైరల్‌లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు వైర్లెస్ మొబైల్ చార్జింగ్ ప్యాడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోడిమ్మింగ్ రియర్‌వ్యూ మిర్రర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, రెడ్ యాంబియెంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్లీ కొలిజన్ బ్రేక్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, రియర్‌వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్ వంటి ఫీచర్లతో టైగన్ అందుబాటులో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

