న్యూఢిల్లీ : వివో ఎక్స్100 ప్రొ (Vivo X100 Pro) చైనాలో సోమవారం విడుదల కానుండగా భారత్ మార్కెట్లో వివో ఎక్స్100 సిరీస్ ఎప్పుడు లాంఛ్ అవుతుందనే వివరాలపై స్పష్టత రాలేదు. ఇక వివో ఎక్స్100 ప్రొ ఇమేజ్‌లను వివో విడుదల చేసింది. ఈ హాట్ డివైజ్ డిజైన్, కలర్ ఆప్షన్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
కంపెనీ విడుదల చేసిన అధికారిక ఇమేజ్‌ల్లో వివో ఎక్స్100 ప్రొ నాలుగు కెమెరాల సెటప్, ఫ్లాష్‌తో సర్కులర్ కెమెరా ఐలండ్‌తో ఆకట్టుకుంటోంది. వివో ఎక్స్100 ప్రొ మీడియాటెక్ డైమెన్సిటీ 9300ఎస్ఓసీ, జీస్ బ్రాండెడ్ కెమెరాలు, వీ2 ఇమేజింగ్ చిప్‌తో రానుంది. డైమెన్సిటీ 9300 మీడియాటెక్ లేటస్ట్, పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ చిప్ కాగా, జీస్ బ్రాండెడ్ కెమెరాలతో వివో ఎక్స్100 ప్రొ అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది.
వీ2 ఇమేజింగ్ చిప్ వివో ఎక్స్100 ప్రొ కెమెరా సామర్ధ్యం మరింత మెరుగవనుంది. ఇక వివో ఎక్స్100 ప్రొ బేస్ మోడల్ ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 45,600కు అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక వివో ఎక్స్100 ప్రొ బ్లాక్, బ్లూ, వైట్, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుండగా ఈ హాట్ డివైజ్ నాలుగు జీస్ బ్రాండెడ్ సెన్సర్లు, ఎల్ఈడీ ఫ్లాష్‌తో భారీ కెమెరా ఐలండ్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read More :
Hyderabad | ఐటీ అడ్డా హైదరాబాద్.. దిగ్గజ కంపెనీల రెండో పెద్ద కార్యాలయాలు ఇక్కడే