Vistara | విస్తారాను పట్టిపీడిస్తున్న పైలట్ల కొరత.. మరో 38 విమానాలు రద్దు
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి. మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయల్దేరాల్సిన విమానాలను రద్దుచేశారు. ఇందులో ముంబై నుంచి టేక్ఆఫ్ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన 11 విమానాలు ఉన్నాయి. కాగా, సోమవారం 50 విమానాలను రద్దవగా, మరో 160 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
విమానాల రద్దు, ఆలస్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విస్తారా విమానాల కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నదని, సరైన సమాచారం ఉండటం లేదని పలువురు ప్రయాణికులు విమర్శించారు. దీనిపై విస్తారా సంస్థ స్పందిస్తూ.. తమ వినియోగదారులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు చెప్పింది. గతకొన్ని రోజులుగా తాము పైలట్ల (Pilots) కొరతతోపాటు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని వెల్లడించింది. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొంది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

