ముంబై, మే 18: వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘల్ మరణించారు. ఆయన వయస్సు 88 ఏండ్లు. ఐసీఐసీఐ బ్యాంక్‌కు నాయకత్వం వహించిన వాఘల్.. అనారోగ్య సమస్యలతో శనివారం మధ్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వాఘల్కు భార్య, కుమారుడు మోహన్, కుమార్తె సుధ ఉన్నారు. 2010 సంవత్సరానికిగాను వాఘల్ పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. వాఘల్ మృతికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతాపం తెలియజేశారు.