Employees | అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవో (US Based CEO) కీలక నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్‌కు హాజరు కాలేదన్న కారణంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను (Employees) తొలగించారు. మొత్తం 110 మంది ఉద్యోగుల్లో 99 మందిపై వేటు వేశారు. సంస్థలో పనిచేస్తున్న ఓ ఇంటర్న్ ఉద్యోగి పెట్టిన రెడ్డిట్ (Reddit) పోస్ట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సీఈవో మార్నింగ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని ఆదేశించారు. అయితే, మొత్తం 110 మందిలో ఈ మీటింగ్‌కు కేవలం 11 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 99 మంది సమావేశానికి గైర్హాజరయ్యారు (Not Attending Morning Meeting). దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు సీఈవో.. ఉద్యోగులపై వేటు వేశారు. సమావేశానికి హాజరుకాని 99 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు పూర్తిచేయడంలో, సమావేశాలకు హాజరుకావడంలో విఫలమైనట్లు పేర్కొన్నారు. ఈ కారణంచేత ఉద్యోగులతో ఉన్న ఒప్పందాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. సమావేశానికి హాజరైన ఉద్యోగులు మాత్రమే సంస్థలో ఉంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఈవో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.
Also Read..
Emergency | ఎట్టకేలకు ఎమర్జెన్సీ విడుదల ఖరారు.. కొత్త తేదీని ప్రకటించిన కంగనా రనౌత్
Sri Simha | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. శ్రీ సింహా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు
Medical Student | ర్యాగింగ్ పేరిట మూడు గంటలు నిల్చోబెట్టిన సీనియర్లు.. వైద్య విద్యార్థి మృతి