UPI Voice Payments | ఇంతకుముందు స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం పే వంటి యూపీఐ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేవారు. ఫీచర్ ఫోన్ల వాడకం దారులకు ఆ ఫెసిలిటీ అందుబాటులో లేదు. కానీ, ఈ ఏడాది ప్రారంభంలోనే ఫీచర్ ఫోన్ కస్టమర్లకు `యూపీఐ 123 పే సర్వీసెస్` అందుబాటులోకి వచ్చాయి. ఇక సౌండ్ వేవ్ టెక్ సొల్యూసన్స్ సంస్థ టోన్ టాగ్.. ఫీచర్ ఫోన్ యూజర్లు తమ మాతృభాషలోనే మాట్లాడటం ద్వారా చెల్లింపులు.. అంటే యూపీఐ వాయిస్ పేమెంట్స్ సేవలు వినియోగంలోకి తెచ్చింది. ఇందుకోసం టోన్‌టాగ్ సొల్యూసన్స్ అభివృద్ధి చేసింది. దీంతో తెలుగు వారు కూడా తమ వాయిస్‌తో పేమెంట్స్ జరుపొచ్చు.
కస్టమర్లకు వాయిస్ యూపీఐ పేమెంట్స్ సేవలు అందుబాటులోకి తేవడానికి పలు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులతో టోన్ టాగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో `వాయిస్ యూపీఐ పేమెంట్స్` వినియోగంలోకి వచ్చాయి. అర్బన్, రూరల్ ప్రాంతాల మధ్య డిజిటల్ పేమెంట్స్‌లో వ్యత్యాసానికి తెర దించేందుకు ప్రాంతీయ భాషల్లో టోన్‌టాగ్ వాయిస్ ఫస్ట్ సొల్యూసన్ అభివృద్ధి చేసింది. అంటే రూరల్ ప్రాంతాల వాసులకు యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా టోన్ టాగ్ కృషి చేస్తున్నది.
`ఈ ఏడాది మొదట్లో ప్రారంభించిన ఫీచర్ ఫోన్ యూజర్ల వాయిస్సే యూపీఐ డిజిటల్ పేమెంట్స్‌ను మరింత మందికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం టోన్ టాగ్.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో వాయిస్‌తో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి తెచ్చింది. త్వరలో గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లోనూ ఈ సేవలు లభిస్తాయి` అని తెలిపారు.
40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు ప్రాంతీయ భాషల్లో డిజిటల్ పేమెంట్ సేవలు అందుబాటులోకి తేవడానికి.. ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్, ఎన్పీసీఐ భాగస్వామ్యంతో ఎన్పీసీఐ, వాయిస్సే భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.
వాయిస్పే యూపీఐ పేమెంట్స్ కోసం ఫీచర్ ఫోన్ యూజర్లు ఐవీఆర్ నంబర్ 6366 200 200 కు కాల్ చేసి తమకు వచ్చే భాషలో ఆర్థిక లావాదేవీలు జరుపాలని కోరొచ్చు. వాయిస్సే యూపీఐ పేమెంట్స్ సేవలు కేవలం యుటిలిటీ బిల్లుల పేమెంట్స్‌కు, బ్యాలన్స్ ఎంక్వైరీలు, ఫాస్టాగ్ యాక్టివేషన్‌కు వినియోగిస్తారు. ఇతరుల ఖాతాలకు నగదు బదిలీ చేయడానికి అనుమతించరు. వాయిస్సే యూపీఐ పేమెంట్స్ సేవలను ఇంతకుముందు జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని రూరల్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించారు.