UPI Milestone | యూపీఐ చెల్లింపుల్లో మైలురాయి.. 11 నెలల్లో రూ.223 లక్షల కోట్ల పేమెంట్స్..!
UPI Milestone | యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.
UPI Milestone | యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ చేసింది. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ #డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తోంది. 2024 జనవరి- నవంబర్ మధ్య 15,547 కోట్ల లావాదేవీల్లో రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇది భారత్ ఆర్థిక పరివర్తనపై ప్రభావం చూపుతుంది’ అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది.
Driving the #DigitalPayment revolution, UPI achieved 15,547 crore transactions worth Rs. 223 lakh crore from January to November, 2024, showcasing its transformative impact on financial transactions in India.
⁰#FinMinYearReview2024⁰#BankingInitiatives⁰#ViksitBharat pic.twitter.com/Bkbag6542k— Ministry of Finance (@FinMinIndia) December 14, 2024
ప్రస్తుతం ఏడు దేశాల్లో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది భారత్లో పెరిగిపోతున్న డిజిటల్ పేమెంట్స్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. మొబైల్ ఫోన్ల ద్వారా వ్యక్తులు, వ్యాపారుల మధ్య రియల్ టైం లావాదేవీల దిశగా డిజిటల్ చెల్లింపుల పరివర్తన సాగుతోంది. 2015లో ఆర్బీఐ మద్దతుతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రారంభించారు. యూఐడీఏఐ చైర్మన్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకని సారధ్యంలోని కమిటీ.. దేశంలో సమర్ధవంతమైన డిజిటల్ చెల్లింపుల ఫ్రేమ్ వర్క్ స్థాపించాలని ప్రతిపాదించింది. తదనుగుణంగా యూపీఐ ఏర్పాటు జరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

