న్యూఢిల్లీ, జూన్ 8: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి దశపై వచ్చే నెలలో సంతకాలు జరిగే అవకాశం ఉన్నదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ప్రకటించారు. భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేయనున్నదని మోదీ సర్కార్ భావిస్తున్నది.
ఒప్పందానికి సంబంధించి మొదటి దశ జూలై మధ్యనాటికి సిద్ధం కాగలదని, దీనివల్ల భారత్లోని కొన్ని రంగాల్లో వాణిజ్య అవకాశాలు పెరిగి, దేశీయ ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో మరింత సమర్థవంతంగా పోటీపడటానికి వీలవుతుందని కేంద్రం చెబుతున్నది.