Hoax Bomb Threats | పౌర విమానయాన సంస్థలకు ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే బూటకపు బెదిరింపులు, ఫేక్ న్యూస్ వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది. ఈ విషయమై నిబంధనలను అతిక్రమిస్తే ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.
తమ ఆదేశాలు ధిక్కరిస్తే థర్డ్ పార్టీ కంటెంట్ ను ఆయా సోషల్ మీడియా వేదికలు తీసుకునే వెసులుబాటు నిలిపేస్తామని కేంద్రం స్పస్టం చేసింది. ఇటీవల కొన్ని రోజులుగా పలు విమానయాన సంస్థల విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, వాటితో నిలిచిపోయిన లేదా ఆలస్యమైన విమాన సర్వీసులతో ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు తలెత్తిన ఇబ్బందులను కేంద్రం గుర్తు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరంగా ఫేక్ న్యూస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.