న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రధాన బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత నెల చివరినాటికి ప్రభుత్వరంగ బ్యాం కులతోపాటు ప్రైవేట్, విదేశీ బ్యాంకుల వద్ద అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.72, 454 కోట్లకు చేరుకున్నాయని పార్లమెంట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. గడిచిన పదేండ్లుగా పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాల్లో ఉన్న డిపాజిట్ల ఆధారంగా ఈ నివేదికను రిజర్వుబ్యాంక్ రూపొందించినట్టు ఆయన చెప్పారు.
వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద రూ.60,571 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా, ప్రైవేట్ రంగ బ్యాంకు ల్లో రూ.9,607 కోట్లు, విదేశీ బ్యాంకు ల్లో రూ.2,275 కోట్లు ఉన్నాయి.