Twitter India MD Transfered | న్యూ ఐటీ రూల్స్ అమలులో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వాతావరణం.. రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నేతల ట్విట్టర్ హ్యాండిల్స్ నిలిపివేత నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ మహేశ్వరిపై బదిలీ వేటు పడింది. ఆయన ఇక అమెరికాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నూతన పాత్ర పోషిస్తారు. ఈ విషయాన్ని ట్విట్టర్ జపాన్, దక్షిణ కొరియా, ఆసియా పసిఫిక్ డివిజన్ (జపాక్) ఉపాధ్యక్షుడు యు శసామొటో శుక్రవారం వెల్లడించారు.
“భారత బిజినెస్‌కు రెండేండ్లకు పైగా సారధ్యం వహించినందుకు మీకు ధన్యవాదాలు మనీషం.. అమెరికాలో నూతన బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నా” అని యు శసామొటో ట్వీట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా నూతన మార్కెట్లలో ఆపరేషన్లు రెవెన్యూ స్ట్రాటర్జీ ఇన్‌చార్జీగా మనీశ్ మహేశ్వరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్విట్టర్ పురోభివ్రుద్ధికి ముఖ్యమైన బాధ్యతలను మీరు చేపట్టనున్నారు. ఆ సమయం కోసం వేచి చూస్తున్నానని ట్వీట్లో యు శసామొటో పేర్కొన్నారు.
Paytm’s IPO | పేటీఎంకు షాక్.. ఐపీవోకు అనుమతి లభిస్తుందా.. ఎందుకంటే?!!
Electric vehicles | పెట్రో ధరల పెంపు ఎఫెక్ట్.. మార్కెట్లోకి దూసుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు
Huzurabad | ఈటలకు షాక్.. ‘గెల్లు’కే మా ఓటన్న ముదిరాజ్‌లు
Vinesh Phogat: రెజ్లింగ్‌కు తిరిగొస్తానో లేదో.. తీవ్ర నిరాశలో వినేష్ ఫోగాట్