TRAI | టెలికాం కంపెనీల ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్లపై తలెత్తిన వివాదంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పందించింది. ఈ విషయంలో ప్రస్తుతం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రాయ్ వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ కంపెనీలు రూ.249 ఎంట్రీ లెవల్ ప్లాన్ తొలగింపుపై తమ సమాధానం ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. ఈ కంపెనీల్లో ఒక ప్లాన్ ఉపసంహరణను ధ్రువీకరిస్తూ అవసరమైన పత్రాలను ట్రాయ్‌కి సమర్పించగా.. మరొక కంపెనీ ఈ ప్లాన్ ఇప్పటికీ అందుబాటులో ఉందని.. కానీ స్టోర్స్‌లో మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. జియో రోజుకు ఒక జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.249 ప్లాన్‌ను మై జియో యాప్, జియా వెబ్సైట్ నుంచి తొలగించింది. అయితే, ఈ ప్లాన్ జియో రిటైల్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. మరో వైపు ఎయిర్టెల్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ నుంచి రూ.249 ఎంట్రీ ప్లాన్‌ను తొలగించింది. రెండు కంపెనీలు సమర్పించిన సమాధాలను పరిశీలించి.. రెగ్యులేటరీ ప్రమాణాల ఆధారంగా దర్యాప్తు చేస్టున్నట్లు ట్రాయ్ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు తక్షణ జోక్యం అవసరం లేదని ట్రాయ్ భావిస్తున్నది.