E20 Petrol | భారత్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి విక్రయిస్తున్నది. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్‌ను మిక్స్ చేయడం ద్వారా దిగుమతులను సైతం తగ్గించవచ్చని.. అదే సమయంలో కాలుష్యాన్ని సైతం తగ్గించవచ్చని రవాణాశాఖ పేర్కొంది. వాహన యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. అయితే, ఇటీవల కాలంలో ప్రస్తుతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల వాహనాల ఇంజిన్లు డ్యామేజ్ అవుతాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఓ వాహనదారుడు తన కారులో ఈ20 ఇంధనాన్ని వాడడడం సరైందేనా అంటూ టయోటా కంపెనీ సపోర్ట్ టీమ్ ప్రశ్నించాడు. దీనికి టయోటా కంపెనీ ఇచ్చిన సమాధానం ఆటో పరిశ్రమలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అర్బన్ క్రూయిజర్ వాహనంలో E20 పెట్రోల్‌ను వాడవచ్చా? అని అడిగిన ప్రశ్నకు టయోటా టీమ్ సపోర్ట్ అలా చేయకూడదని చెప్పింది. కంపెనీ ఇచ్చిన సమాధానంతో వాహనదారులు వాహనాల ఇంజిన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. టీమ్ సపోర్ట్ కారు యజమాని మాన్యువల్‌ని చూడమని అడ్వైజ్ ఇచ్చింది. అయితే, అయితే వాహనదారుడు యూజర్ మాన్యువల్‌ను పరిశీలించగా.. E20 ఇంధనాన్ని వాడితే వారంటీ అందుబాటులో ఉంటుందా? అనే ప్రశ్నకు ‘లేదు’ అంటూ సమాధానం ఉన్నది. మాన్యువల్ ప్రకారం ఇంధనాన్ని వాడాన్ని కంపెనీ సూచించింది. అందులో స్పష్టంగా E10 ఫ్యూయల్‌ని మాత్రమే మాత్రమే ఉపయోగించాలని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. కారుకి ఇంధనం వల్ల జరిగే నష్టం వారంటీలో కవర్ కాదని స్పష్టం చేసింది. టయోటా E20 తమ వాహనదారులకు హెచ్చరికలు చేసినప్పటికీ.. టాటా మోటార్స్ మాత్రం తమ వాహనాలన్నీ E20తో ఎలాంటి సమస్య లేకుండా నడపగలవని చెబుతోంది.
బజాజ్ అదే విషయాన్ని చెప్పింది. అయితే, పాత బీఎస్-3 మోడల్ బైక్స్‌లో ఫ్యూయల్ సిస్టమ్‌ని క్లీన్ చేసుకోవాలని సూచించింది. తద్వారా ఇథనాల్ వల్ల ఏర్పడిన మురికి థొరెటల్ బాడీ, సిస్టమ్‌లో పేరుకుపోదని చెప్పింది. ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ మొత్తాన్ని పెంచింది. చాలాచోట్ల E20ని సైతం సాధారణ పెట్రోల్‌గా విక్రయిస్తున్నది. కానీ టయోటా కార్ల కంపెనీ హెచ్చరికల ప్రకారం.. E20 అనుకూలమైన వాహనాల్లోనే వాడాలని.. మిగతా వాహనాల్లో దీర్ఘకాలం వాడితే ఇంజిన్ దెబ్బతుంటుందది. పలు సందర్భాల్లో వారంటీ సైతం చెల్లుబాటు కాదని చెబుతున్నది. పలు నివేదికలు సైతం ఈ20 వల్ల జరిగే నష్టాన్ని బీమా కంపెనీలు సైతం భరించవని పేర్కొంటున్నాయి. సమస్యను నివారించేందుకు ఇథనాల్ లేని 100 ఆక్టేన్ పెట్రోల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్, హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీలు ఆక్టేన్ పెట్రోల్‌ని విక్రయిస్తుంటాయి. ఆక్టేన్ పెట్రోల్‌ను ఉపయోగించడం ద్వారా వాహనాల ఇంజిన్ లైఫ్ ఇవ్వడంతో పాటు మైలేజ్, స్పీడ్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటుండగా.. ఈ పెట్రోల్ ధర లీటర్‌కు రూ.160 వరకు పలుకుతున్నది.