మాదాపూర్, జూలై 24: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌ను అందిస్తు పరిశ్రమాలకు, రైతులకు అండగా నిలుస్తున్నారని టూరిజం, క్రీడా, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం టీసీఈఐ (తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక టీసీఈఐ ఎస్ఐడబ్ల్యూపీసీ గ్లోబల్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఈవెంట్ వెడ్డింగ్ ప్లానర్స్ తమ కార్యక్రమాలను ఇతర ప్రాంతాల్లో కాకుండా హైదరాబాద్‌లో చేసినట్లయితే ప్రభుత్వం నుండి అన్ని రకాల సహయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఈవెంట్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు, ఇక్కడి వెడ్డింగ్ ఇండస్ట్రీ యొక్క సామర్థ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కార్యక్రమం ద్వారా తెలియజెప్పడం అభినందనీయమన్నారు.