న్యూఢిల్లీ, అక్టోబర్ 9: బంగారం, వెండి ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టాయి. బుధవారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి విలువ రూ.600 దిగి రూ.77,700 వద్ద నిలిచింది. ఇక వెండి రేటు ఏకంగా కిలో రూ.2,800 పడి రూ.91,200 పలికింది.
మార్కెట్లో డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. కాగా, హైదరాబాద్లో 24 క్యారెట్ గోల్డ్ తులం రేటు రూ.760 క్షీణించి రూ.76,690గా ఉన్నది. 22 క్యారెట్ రూ.700 తగ్గి రూ.70,300గా నమోదైంది.