ముంబై: మంగళవారం లాభాలబాట పట్టిన స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రారంభ సెషన్ లో నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే లాభాల్లో కదలాడి నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 68 పాయింట్ల లాభంతో 57,966 వద్ద.. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 17,255 వద్ద ట్రేడవుతున్నాయి.
డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.