శుక్రవారం 15 జనవరి 2021
Business - Dec 01, 2020 , 15:31:26

ఈరోజు బంగారం ,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...?

ఈరోజు బంగారం ,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...?

ముంబై :గత నెలలో భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు ప్రారంభ సెషన్ లో స్వల్పంగా పెరిగాయి. అయితే ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్ )లో 10 గ్రాముల ఫిబ్రవరి ఫ్యూచర్స్ ప్రారంభంలో 0.3 శాతం ఎగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 1.2 శాతం పెరిగింది. అయితే బంగారం, వెండి ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో బంగారం ధరలు రూ.8500 తక్కువగా ఉంది.ఇవ్వాళ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.10 గ్రాముల బంగారం రూ.87.00 (-0.18%) క్షీణించి రూ.47,705.00 వద్ద ట్రేడ్ అయింది.

రూ.48,194.00 వద్ద ప్రారంభమై, రూ.48,272.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,705.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.61.00 (-0.13%) క్షీణించి రూ.47,857.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,097.00 వద్ద ప్రారంభమై, రూ.48,138.00 గరిష్టాన్ని, రూ.47,771.00 వద్ద కనిష్టాన్ని తాకింది. నిన్న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.362.00 (-0.75%) క్షీణించి రూ.47,763.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.184.00 (-0.38%) తగ్గి రూ.47,915.00 వద్ద ముగిసింది.

ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర (డిసెంబర్) రూ.558.00 (0.94%) పెరిగి రూ.59680.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.59,908.00 వద్ద ప్రారంభమై, రూ.60,000.00 గరిష్టాన్ని, రూ.59,512.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.478.00 (0.79%) పెరిగి రూ.60700.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,012.00 ప్రారంభమై, రూ.61,109.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,575.00 వద్ద కనిష్టాన్న తాకింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.34.00 (-0.06%) తగ్గి రూ.58,950.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.129.00 (-0.21%) తగ్గి రూ.60,130.00 వద్ద ముగిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.