2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఫైన్ లేకుండా ఈ నెలాఖరే గడువు. అయితే ఉత్తరాది రాష్ర్టాల్లో వరదల నేపథ్యంలో గడువును పొడిగిస్తారనే అపోహలున్నాయి. కానీ అలాం టి ఆలోచనేదీ లేదని కేంద్ర రెవిన్యూ శాఖ చెప్తున్నది. కాబట్టి ఫైలింగ్ చేసేయండి.
కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ ఫార్మ్ 16ను జారీ చేస్తాయి.
వడ్డీ ఆదాయం రూ.10 వేలకు మించి నా మనం ఇంట్రెస్ట్ సర్టిఫికెట్లను దగ్గరుంచుకోవాలి. గృహ రుణం ఉన్నవాళ్లు వడ్డీ చెల్లింపులకు సంబంధించి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రీ-పేమెంట్ సర్టిఫికెట్లను పొందాలి. సెక్షన్ 24సీ కింద గరిష్ఠంగా రూ.2 లక్షలదాకా వడ్డీని రాయితీగా పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద హౌజింగ్ లోన్‌పై చెల్లించే అసలు మొత్తంలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకూ డిడక్షన్‌గా పొందవచ్చు.
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి పొందిన వడ్డీ ఆదాయం రూ.40 వేలు (సీనియర్ సిటిజన్లకు రూ.50 వేలు) దాటితే దానిపై టీడీఎస్ కట్ అవుతుంది. బ్యాంకే ఈ ఫార్మ్ 16ఏ ఇస్తుంది. రూ.5 వేలు దాటిన డివిడెండ్స్‌పై కూడా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ట్యాక్స్ కట్ చేస్తాయి. ఇవి కూడా ఇస్తాయి.
రెండేండ్ల క్రితం ఈ ఫారాన్ని తెచ్చారు. ఇండివిడ్యుయల్ ట్యాక్స్ పేయర్ ఏ లావాదేవీలు జరిపారన్నది దీనిలో ఉంటుంది. ఐటీ వెబ్సైట్ ద్వారా ఫారాన్ని డౌన్లోడ్ చేయాలి.
దీన్ని ఐటీ పోర్టల్‌లో డౌన్లోడ్ చేయాలి.
ఉద్యోగులైతే తమ ఎంప్లాయర్‌కు ముందస్తుగానే సేవింగ్స్ సమాచారం ఇచ్చి ఉంటారు కాబట్టి అందుకు తగ్గట్టు టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. ఒకవేళ వ్యాపారులు, కన్సల్టెంట్స్ అయితే తమ ఖర్చులకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే దీని ఆధారంగానే ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది.
ఇల్లు, స్థలం, పొలం.. ఇలా ఏది అమ్మినా కూడా మనం క్యాపిటల్ గెయిన్స్ పరిధిలోకి వస్తాం. ఈ సమాచారాన్ని తప్పక ఐటీఆర్‌లో పొందుపర్చాలి. ఇండివిడ్యువల్స్ ఐటీఆర్2 లేదా ఐటీఆర్3 ఫైల్ చేయాలి. ఇందుకోసం సేల్ డీడ్, పర్చేజ్ అగ్రిమెంట్ వంటివి సిద్ధం చేసుకోవాలి.
అన్‌లిస్టెడ్ స్టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఐటీఆర్2లో ఈ సమాచారం ఇవ్వాలి. కంపెనీ పేరు, పాన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఫేజ్ వాల్యూ, ఇష్యూ ప్రైస్, పర్చేజ్ ప్రైస్ వంటి ఇన్ఫర్మేషన్ సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితోపాటు ఏవైనా అన్‌లిస్టెడ్ షేర్లలో జరిపిన లావాదేవీలనూ పేర్కొనాలి.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం తప్పనిసరి.
ఐటీ రిఫండ్స్ కోసం మీ బ్యాంక్ పేరు, ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇవ్వాలి.
-నాగేంద్ర సాయి
కుందవరం–