ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉండే నెయ్యి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యిలో ఉండే బ్యుటిరేట్ అనే ఫ్యాటీ ఆసిడ్‌కు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. కందిన చర్మం, దద్దుర్లలాంటి వాటికి మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, ఇ, కె,డిలు చర్మాన్ని, జుట్టును ఆర్యోగంగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి.
ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు పొడిబారిన చర్మానికి తేమను సమకూర్చి జీవాన్నిస్తాయి. ముఖానికి స్వచ్ఛమైన నెయ్యిని అప్లయ్ చేసి.. ఓ అరగంట తర్వాత సున్నిపిండితో శుభ్రం చేసుకుంటే.. మంచి గుణం కనిపిస్తుంది.