e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News 15 నెల‌ల్లో ఈ ఐఐటీయ‌న్ సంప‌దెంతంటే!

15 నెల‌ల్లో ఈ ఐఐటీయ‌న్ సంప‌దెంతంటే!

15 నెల‌ల్లో ఈ ఐఐటీయ‌న్ సంప‌దెంతంటే!

న్యూఢిల్లీ: సురోజిత్ చ‌టర్జీ.. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్‌. అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న అతిపెద్ద క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్.. కాయిన్ బేస్ గ్లోబ‌ల్‌లో చీఫ్ ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్‌. కేవ‌లం 15 నెల‌ల్లోనే ఆయ‌న సంపాద‌న సుమారు 180.8 మిలియ‌న్ డాల‌ర్లు.. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1500 కోట్లు.. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో సంస్థ చీఫ్ ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్‌గా సురోజిత్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మ‌రి.

ఐదేండ్ల‌లో రూ.3,500 కోట్ల సంపాద‌న ల‌క్ష్యం

బుధ‌వారం న్యూయార్క్‌లోని నాస్‌డాక్ స్టాక్‌ ఎక్స్చేంజిలో లిస్టెడ్ కంపెనీగా కాయిన్‌బేస్ గ్లోబ‌ల్ తొలి రోజు ట్రేడింగ్ పూర్త‌యిన త‌ర్వాత సురోజిత్ చ‌ట‌ర్జీ సంపాదించిన వాటా 180.8 మిలియ‌న్ల డాల‌ర్లు. అంతే కాదు వ‌చ్చే ఐదేండ్ల‌లో సుమారు 465.5 మిలియ‌న్ల డాల‌ర్లు (రూ.3,500 కోట్లు) సంపాదించాల‌ని ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

గూగుల్‌లో మూడేండ్లు సురోజిత్

ఖ‌ర‌గ్‌ఫూర్ ఐఐటీలో బీఎస్ఈ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్న సురోజిత్ చ‌టర్జీ .. కాయిన్‌బేస్‌లో చేర‌డానికి ముందు మూడేండ్ల పాటు సెర్చింజ‌న్ గూగుల్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో సేవలందించారు.

దీనికంటే ముందు యాడ్స్ అండ్ యాడ్‌సెన్స్‌లో డెలివ‌రీ ఫ‌ర్ మొబైల్ సెర్చ్ ప్రొడ‌క్ట్ అధిప‌తిగా ప‌ని చేశారు. తొలుత ఇండియ‌న్ ఈ-కామ‌ర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొద్దికాలం పాటు సేవ‌లందించారు.

15 నెల‌ల్లో ఈ ఐఐటీయ‌న్ సంప‌దెంతంటే!

కాయిన్‌బేస్ ఫౌండ‌ర్‌ను ఆక‌ట్టుకున్న ఐఐటీయ‌న్

బెంగ‌ళూరు కేంద్రంగా సేవ‌లందిస్తున్న ఓ కంపెనీలో ఆయ‌న సేవ‌లు కాయిన్‌బేస్ ఫౌండ‌ర్స్‌లో ఒక‌రు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఆక‌ర్షించాయి. గ‌తేడాది సురోజిత్ చ‌ట‌ర్జీ నియామకంపై ఆర్మ్‌స్ట్రాంగ్ త‌న బ్లాగ్‌లో చేసిన పోస్ట్ దీనికి రుజువుగా నిలిచింది.

సురోజిత్‌పై ఆర్మ్‌స్ట్రాంగ్ ఇలా

అమెరికాలో ప‌ని చేస్తూ, జీవించే వారికి స‌రిహ‌ద్దుల ఆవ‌ల లావాదేవీల‌ను స‌ర‌ళ‌త‌రం చేసే అవ‌కాశం చాలా క‌ష్టం అని కాయిన్ బేస్ సీఈవో ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యాఖ్యానించారు. నాస్‌డాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ అయిన తొలిరోజు కాయిన్‌బేస్ ఫౌండ‌ర్లు బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఫ్రెడ్ ఎహ్ర‌సామ్‌తోపాటు ల‌బ్ధి పొందిన వారిలో సురోజిత్ ఒక‌రు.

కాయిన్‌బేస్ త్ర‌యం సంపాద‌న 16 బిలియ‌న్ల‌పైనే

బ్లూంబ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ ప్ర‌కారం ఈ ముగ్గురి సంప‌ద 16 బిలియ‌న్ డాల‌ర్ల పైమాటే.. కాయిన్‌బేస్ షేర్ 381 డాల‌ర్ల వ‌ద్ద ప్రారంభ‌మై 430 డాల‌ర్ల‌కు చేరుకుని తిరిగి 328.28 డాల‌ర్ల వ‌ద్ద ముగిసింది. కాయిన్ బేస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 100 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరువ‌లో ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

పెట్రో సెగ‌ల‌తో ధ‌ర‌ల మంట

కొవిడ్‌పై పోరు.. ఫ్రీగా ఆక్సిజ‌న్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ

ఇస్రో సైంటిస్టు అరెస్టు.. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశం

‘మోటో’లవర్స్‌ కి గుడ్‌ న్యూస్‌

ఆర్‌బీఐ అలర్ట్‌.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్‌టీజీఎస్‌ సేవలు

ఎగుమతి చేసిన చేతితోనే..

ఇన్ఫీ లాభం 5,076 కోట్లు

మార్కెట్లోకి హైబ్రిడ్‌ ట్రాక్టర్‌

ఎల్‌ఐసీ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌!

వాట్సాప్‌లో ఈ ట్రిక్స్‌ తెలుసా?

బైడెన్‌ ఎఫెక్ట్‌ : భారత టెక్‌, ఫార్మా కంపెనీలపై పన్ను భారం

ఏప్రిల్ 20న వ‌స్తున్న యాపిల్ కొత్త ప్రోడ‌క్ట్స్ ఇవే..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
15 నెల‌ల్లో ఈ ఐఐటీయ‌న్ సంప‌దెంతంటే!

ట్రెండింగ్‌

Advertisement