హైదరాబాద్, సెప్టెంబర్ 20: ప్రముఖ గృహోపకరణాల విక్రయ సంస్థ క్యూ మార్ట్..హైదరాబాద్‌లో మూడో స్టోర్‌ను ప్రారంభించింది. సత్వా నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.
3 వేల నుంచి 4 వేల లోపు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో అన్ని రకాల గృహోపకరణాలు లభించనున్నాయని క్యూ మార్ట్ డైరెక్టర్ రాహుల్ వర్మా తెలిపారు. త్వరలో బెంగళూరు, చెన్నై మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.