Home Loans | ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచేసింది. మరో మూడు నెలల్లో 100 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. మూడు నెలల్లో 4-6 శాతం వరకు రెపోరేట్ పెరుగవచ్చునని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా వడ్డీరేట్లు పెంచేస్తాయి. తదనుగుణంగా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు, కొత్తగా రుణాలు తీసుకునే వారిపై నెల వారీ వాయిదా చెల్లింపులు (ఈఎంఐ) పెరిగిపోతాయి.
ఇటీవల ఆర్బీఐ 40 బేసిక్ పాయింట్లు పెంచడంతో రెపోరేట్ 4.40 శాతానికి, క్యాష్ రిజర్వు రేషన్ (సీఆర్ఆర్) 50 బేసిక్ పాయింట్లు పెరిగి 4.5 శాతానికి చేరుకున్నది. సీఆర్ఆర్ పెంచడంతో బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి అదనంగా రూ.82,000-87,000 కోట్ల మేరకు నిధుల లభ్యత పెరుగనున్నది. కానీ, రెపోరేటు పెంచడంతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేట్లు పెంచుతాయని భావిస్తున్నాయి. ఫలితంగా ఇండ్ల రుణాల గ్రహీతలపై అదనపు భారం పడుతుంది.
పలు బ్యాంకులు రెపోరేట్‌ను ఉపయోగించుకుని తమ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లు పెంచేస్తాయి. ప్రతి మూడు నెలల కోసారి బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్లు సర్దుబాటు చేస్తాయి. అయితే, ఫిక్స్డ్ వడ్డీరేట్లపై రుణాలు తీసుకున్న వారికి..రెపోరేట్ పెరిగినా వడ్డీరేట్ల పెరుగుదల ప్రభావం పడదు. రెపోరేట్‌కు అనుగుణంగా ప్రస్తుతం ఐదు బ్యాంకుల్లో మార్పులు జరిగిన వడ్డీరేట్లు.. ఇంటి రుణాలపై దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం..
బ్యాంక్ ———- ——- ——– ఆర్పీఎల్ఆర్ —– కనీసం —- గరిష్టం
బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ——— 6.8% ——— —— 6.4% ——- 7.38%
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ — 6.60% ——– —– 6.5% ——– 7.35%
బ్యాంక్ ఆఫ్ ఇండియా ———— 6.85% ————– 6.5% ——- 8.2%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ——— 6.5% ——- ——- 6.5% ——- 7.65%
కొటక్ మహీంద్రా బ్యాంక్ ——- — 6.6% ——– —— 6.6% ——- 7.1%