Badshah Divorce | పాపం బాద్షా.. రెండో పెళ్లైన ఐదు నెలలకే విడాకులు..!
Badshah Divorce : ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్షా (Rapper Badshah) వివాహ జీవితంలో మరో కుదుపు. రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అతడు ఐదు నెలలు తిరిగేసరికే విడాకులు తీసుకున్నాడు.
Badshah Divorce : ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్షా (Rapper Badshah) వివాహ జీవితంలో మరో కుదుపు. రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అతడు ఐదు నెలలు తిరిగేసరికే విడాకులు తీసుకున్నాడు. పంజాబీ నటి ఇషా రిఖీ (Isha Rikhi)తో తన బంధాన్ని ముగించాడీ సింగర్. ఆగస్టు 31వ తేదీన వీరు డైవరర్స్ తీసుకున్నారు. ఇంత త్వరగా వేరవ్వడంపై ప్రశ్నలు రేకెత్తుతున్న వేళ తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయామని ఇషా, బాద్షాలు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ర్యాపర్ బాద్షా, పంజాబీ నటి ఇషా రిఖీల వైవాహిక జీవితం ఐదు నెలల్లోనే ముగిసింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని బాద్షా ప్రకటించాడు. ‘నేను, ఇషా రిఖీ విడిపోతున్నాం. పరస్పర అంగీకారంతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని అందరినీ కోరుతున్నా. రాబోయే రోజుల్లో మా అనుబంధం గురించి ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయకూడదని మేము అభ్యర్థిస్తున్నాం’ అని బాద్షా పోస్ట్ పెట్టాడు.
#Badshah and #IshaRikhi have announced their separation five months after their marriage. The couple shared statements on social media saying they have “mutually decided to part ways” and requested privacy and no further speculation about their relationship. #News pic.twitter.com/2JmPeKxPm5
— Filmfare (@filmfare) September 1, 2026
అయితే.. ఇషా మాత్రం ఇక తనకు భయం భయంగా జీవించాల్సిన రోజులు పోయాయని పోస్ట్ పెట్టడం గమనార్హం.
‘కొన్ని యుద్ధాల్లో ఎలాంటి మచ్చలు ఉండవు. కొన్ని రోజులుగా భయంతో నేను మౌనంగా ఉన్నా. నా భర్తకు ఉన్న పలుకుబడి, అధికారం, ఇతర వనరులను చూసి ఎంతో పొంగిపోయిన నేను.. నిశబ్దంగా ఉండడమే సురక్షితమని నాకు నేను చెప్పుకున్నా. అయితే.. మౌనం అనేది ఎల్లప్పుడూ అంగీకారం కాదు. బతికి ఉండేందుకు అదొక మార్గం. అయితే.. ఈ రోజు నేను భయం బదులు ధైర్యాన్ని ఎంచుకున్నా. అందరికీ నేను మొత్తం కథ చెప్పలేకపోవచ్చు.. కానీ, అంతా సరి అయినందున ఇకపై నేను భయపడాల్సిన పని లేదు’ అని ఇషా పేర్కొంది.
Rapper Badshah and actress Isha Rikhi have confirmed their divorce, five months after their marriage went public. In matching Instagram Story posts, the two said they “mutually decided to part ways” and asked for privacy, calling it their only statement on the matter. 💔… pic.twitter.com/kJgrUEwuSR
— InstantBollywood (@instantbolly) September 1, 2026
అప్పుడు మూడేళ్లకే
‘సోల్మేట్’, ‘గర్మీ’, ‘జెండా ఫూల్’, ‘అక్కడ్ బక్కడ్’, ‘లెట్స్ నాచో’, ‘బ్యాడ్ బాయ్’.. వంటి ఆల్బమ్స్తో విశేష గుర్తింపు తెచ్చుకున్న బాద్షా మొదటగా జాస్మినే మసిహ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2017లో గ్రేస్ మసిహ్ సింగ్ అనే అమ్మాయి జన్మించింది. అనంతరం మూడేళ్లకే మనస్ఫర్ధలతో జాస్మినేకు బాద్షా విడాకులు ఇచ్చాడు. 2020 నుంచి సింగిల్గానే ఉంటున్న ర్యాప్ కింగ్ తన జీవితంలోకి నిషా రిఖీని 2026 మార్చి 24వ తేదీన రెండో భార్యగా ఆహ్వానించాడు. కానీ, ఇప్పుడు తనతో కూడా డైవోర్స్ కావడంతో ర్యాంప్ కింగ్ మళ్లీ ఒంటరయ్యాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

