Hit and Run Case | హిట్ అండ్ రన్ కేసు.. రాయదుర్గం పీఎస్‌లో సందీప్.. వీడియో
Hit and Run Case | హిట్ అండ్ రన్ కేసులో సందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రాయదుర్గం పీఎస్‌కు తరలించారు. అక్కడ సందీప్ చైర్లో కూర్చున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
Hit and Run Case | హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి టీటీడీ బోర్డ్ మెంబర్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బీహార్‌కు చెందిన నందులాల్ ప్రాణాలు కోల్పోయాడు. హిట్ అండ్ రన్ కేసులో సందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రాయదుర్గం పీఎస్‌కు తరలించారు. అక్కడ సందీప్ చైర్లో కూర్చున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ మెయిన్ రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సందీప్ అతివేగంగా నడుపుతూ వచ్చిన కారు రోడ్డు దాటుతున్న నందులాల్‌ను తీవ్రంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న నందులాల్‌ను కాపాడేందుకు జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి స్పందించి, తన కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ మార్గంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సందీప్ కారును మరో మహీంద్రా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ అనూహ్య పరిణామాల మధ్య గాయపడిన నందులాల్ మృతి చెందాడు. ప్రమాదానికి పాల్పడిన తర్వాత వెనుక నుంచి ఢీకొట్టిన మహీంద్రా కారు ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నిపుణుల సాయంతో ప్రమాదానికి కారణమైన సందీప్ కారుతోపాటు, దానిని ఢీకొట్టి వెళ్లిపోయిన మహీంద్రా కారును గుర్తించారు.
హిట్ అండ్ రన్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేసిన రాయదుర్గం పోలీసులు https://t.co/HcT3CCFmn2 pic.twitter.com/6e8rCo7xJL
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2026
Read Also :
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

