Chirag Paswan | కరుడుగట్టిన ఉగ్రవాదులు నిన్ను చంపేస్తారు.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు
Chirag Paswan : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను చంపేస్తామంటూ ఒక బెదిరింపు పోస్ట్ వచ్చింది. కరుడుగట్టిన తీవ్రవాదులు చిరాగ్‌ను చంపేస్తారంటూ ఆ పోస్ట్‌లో ఉంది.
Chirag Paswan : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను చంపేస్తామంటూ ఒక బెదిరింపు పోస్ట్ వచ్చింది. కరుడుగట్టిన తీవ్రవాదులు చిరాగ్‌ను చంపేస్తారంటూ ఆ పోస్ట్‌లో ఉంది. దీనిపై చిరాగ్ పాశ్వాన్ కార్యాలయం మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ బెదిరింపు పోస్ట్‌పై విచారణ జరపాలని, మంత్రి భద్రతను సమీక్షించాలని ఫిర్యాదులో కోరింది.
లోక్‌జనశక్తి (రామ్ విలాస్) పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు పోస్టులో ఒక లేఖ వచ్చింది. ‘‘త్వరలోనే కరుడుగట్టిన ఉగ్రవాదులు నిన్ను చంపేస్తారు’’ అంటూ ఆ లేఖలో ఉంది. ఈ లేఖలో మొబైల్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఈ లేఖ అందుకున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కార్యాలయం.. దీనిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. కేంద్ర హోం శాఖ సెక్రెటరీ అలోక్ కుమార్‌కు ఈ అంశంపై ఫిర్యాదు చేసింది. చిరాగ్ పాశ్వాన్‌కు వచ్చిన బెదిరింపును ప్రస్తావించింది. ఈ బెదిరింపుపై విచారణ జరపాలని కోరింది.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది.. ఆయనకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది వంటి వివరాలపై ఆరా తీయాలని కోరింది. అలాగే, వెంటనే చిరాగ్ పాశ్వాన్ భద్రతపై సమీక్షించాలని కూడా లేఖలో కోరింది. ఆయనకు వచ్చిన ఒరిజినల్ బెదిరింపు లేఖను కూడా హోం శాఖకు అందజేసింది. ప్రస్తుతం మంత్రికి జడ్ కేటగిరి భద్రత అందుతోంది. ఈ బెదిరింపుపై సమీక్షించిన అనంతరం అవసరమైతే కేంద్రం అదనపు భద్రత కల్పించే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

