న్యూఢిల్లీ, జూలై 7: భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గత ఏడాది 44 శాతం పెరిగాయని ఐక్యరాజ్య సమితి (యూఎన్) తెలిపింది. 39 బిలియన్ డాలర్లు వచ్చినట్టు చెప్పింది. 2026 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టును మంగళవారం యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విభాగం విడుదల చేసింది.
ఈ సందర్భంగా 2025లో ప్రపంచ ఎఫ్డీఐ 6 శాతం పెరిగి 1.6 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నది. అభివృద్ధి చెందిన దేశాల్లోకి 11 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి 2 శాతం పెరిగినట్టు వివరించింది.