న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సంస్థల సీఈవోల వేతనాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గడిచిన పదేండ్లలో 835 శాతం పెరిగాయి. 2012లో సరాసరిగా రూ.80 లక్షలు అందుకున్న సీఈవోలు.. ప్రస్తుతం రూ.50 కోట్లు అందుకుంటున్నారు. దేశీయ టాప్-5 సంస్థల సీఈవోల జీతాలపై సీఎన్బీసీ-టీవీ18 తాజా నివేదికను విడుదల చేసింది. 2021-22 లో రెమ్యునరేషన్ సరాసరిగా 22 శాతం పెరిగి రూ.30 కోట్ల స్థాయికి చేరుకున్నది. 2017-18 నుంచి 2019-20లో రూ.17-18 కోట్లుండగా.. ప్రస్తుతం ఇది 20 శాతానికిపైగా పెరిగింది. కరోనాతో వరుసగా రెండేండ్లు సీఈవోలతోపాటు ఉద్యోగుల జీతాలు పెంచని సంస్థలు గత ఆర్థిక సంవత్సరం 10 శాతానికిపైగా పెంచాయి.
దేశీయ ఐటీ రంగంలో హెచ్సీఎల్ సీఈవో విజయ కుమార్ అత్యధిక వేతనాన్ని అందుకున్నారు. సంస్థ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో 2021-22 ఏడాదికిగాను ఆయన 16. 52 మిలియన్ డాల ర్లు లేదా రూ. 130 కోట్లు వేతనం అందుకున్నారు. 2021లో పొందిన రూ.123. 13 కోట్ల కంటే 5 శాతం అధికం.