Air Passengers | న్యూఢిల్లీ, మే 21: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగారు. ఏప్రిల్ నెలకుగాను ప్రయాణికులు 3.88 శాతం ఎగబాకి 1.32 కోట్లకు చేరుకున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీ) తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 1.28 కోట్ల మంది ప్రయాణించారు. 1,370 మంది ప్రయాణికులు బోర్డింగ్ రద్దు కావడంతో పరిహారం కింద వీరికి విమానయాన సంస్థలు రూ.1.36 కోట్లు చెల్లింపులు జరిపాయి.
గత నెలలో 32,314 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో పరిహారం, ఇతర కింద రూ.89.26 లక్షలు చెల్లింపులు జరిపాయి. 1,09,910 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. సరైన సమయానికి విమాన సర్వీసులు నడిపే సంస్థల్లో ఆకాశ ఎయిర్ 89.2 శాతంతో తొలి స్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి క్రమంలో ఏఐఎక్స్ కనెక్ట్(79.5 శాతం), విస్తారా (76.2 శాతం), ఇండిగో(76.1 శాతం), ఎయిర్ ఇండియా (72.1 శాతం), స్పైస్‌జెట్(64.2 శాతం), అలయెన్స్ ఎయిర్(49.5 శాతం)తో ఉన్నాయి. ఇండిగో మార్కెట్ వాటా స్వల్పంగా పెరిగి 60.6 శాతానికి చేరుకున్నది. కానీ, టాటా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా పెరగగా, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టింది.