RBI | కేంద్రంలో కొత్త ఏర్పడబోయే సర్కారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. తొలిసారిగా కేంద్రానికి డివిడెంట్ కింద రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో కేంద్రానికి 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.2.11లక్షల డివిడెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 141శాతం ఎక్కువ కావడం విశేషం. 2023 ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక రూ.87,416 కోట్లు కేంద్రానికి బదిలీ చేసింది.
ఈ ఏడాది రూ.75వేలకోట్ల నుంచి రూ.1.20లక్షల కోట్లు డివిడెంట్ విడుదలవుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. వారి అంచనాలకు అందని రీతిలో ఆర్బీఐ డివిడెంట్ను ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు బుధవారం ముంబయిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశీయ ఆర్థిక దృక్పథంతో సహా దేశీయ ఆర్థిక దృక్పథంపై చర్చించారు. ఈ సందర్భంగా రూ.2,10,874 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది.
2023-24 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించేందుకు ఆర్బీఐ ఆమోదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ని ఆర్బీఐ కేంద్రానికి రూ.87,416 కోట్లు ఇచ్చింది. అంతకుముందు 2018-19లో అత్యధికంగా రూ.1.76 లక్షల కోట్లను ఆర్బీఐ కేంద్రానికి డివిడెండ్‌గా ఇచ్చింది. సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై చర్చించింది. 2023-24 సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక, ఆర్థిక నివేదికలను ఆమోదించింది.