ముంబై, సెప్టెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. జీఎస్టీలో పెద్ద ఎత్తున సంస్కరణలను తీసుకురావడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన మార్కెట్లు..చివర్లో ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయాయి.
ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 150.30 పాయింట్లు అందుకొని 80,718.01 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ కేవలం 19.25 పాయింట్లు అందుకొని 24,734 వద్ద ముగిసింది.