న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలు (ఏప్రిల్ 1, 2026 నుంచి) కొత్త ఐటీ చట్టం దేశంలో అమల్లోకి రానున్నది. కాగా, గురువారమే రాష్ట్రపతి సమ్మతి తెలియజేశారంటూ శుక్రవారం ఎక్స్‌లో ఐటీ శాఖ ప్రకటించింది.
ఇక దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితం 1961లో తెచ్చిన ఐటీ చట్టాన్ని సవరిస్తూ మోదీ సర్కారు నూతన ఐటీ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 12నే పార్లమెంట్లో ఇది పాసైంది. చట్టంలోని భాష, సెక్షన్లు, చాప్టర్లు, పదాలను తగ్గించామని కేంద్రం చెప్తున్నది.