ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలు (ఏప్రిల్ 1, 2026 నుంచి) కొత్త ఐటీ చట్టం దేశంలో అమల్లోకి రానున్నది.
పన్ను ఎగవేతదారుల ఆటకట్టించేందుకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టాన్ని ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. ఆర్థిక లావాదేవీలలో డిజిటలైజేషన్ విధానం పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ చట్టాన్ని తదనుగుణంగా ఆధునీకరించనున్నది.