HomeBusinessThe Deadline For Filing Income Tax Returns Itrs For The Previous Financial Year 2023 24 Is The End Of This Month July 31
ITR | కొత్త పన్ను విధానంలో మార్పులు.. ఇవి మీకు తెలుసా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు ఈ నెలాఖరే (జూలై 31). అయితే కొత్త పన్ను విధానంలో అనేక మార్పులొచ్చాయి.
ITR | గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు ఈ నెలాఖరే (జూలై 31). అయితే కొత్త పన్ను విధానంలో అనేక మార్పులొచ్చాయి. కాబట్టి వాటిని గుర్తుంచుకుంటే మంచిది.
2023-24 మొదలు కొత్త పన్ను విధానం డీఫాల్ట్ హోదాను అందుకున్నది. కనుక పన్ను మినహాయింపులను ఆశించే వేతన జీవులు వారి కంపెనీ యాజమాన్యాలకు పాత పన్ను విధానాన్ని కోరుకుంటున్నట్టు తెలియపర్చాలి. లేకపోతే కొత్త పన్ను విధానం పరిధిలో మీకు పన్ను రేట్లు వర్తిస్తాయి.
కొత్త విధానంలో రిబేటు పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. మీకు వార్షిక వేతనం రూ.7.5 లక్షలున్నా పన్ను కట్టనక్కర్లేదు.
కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ఐటీ స్లాబులను 6 నుంచి 5కు తగ్గించారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షలదాకా పన్నుండదు. రూ.3-6 లక్షల మధ్య 5%, రూ.6-9 లక్షల మధ్య 10 %, రూ.9-12 లక్షల మధ్య 15 %, రూ.12-15 లక్షల మధ్య 20 %, రూ.15 లక్షలు దాటితే 30 % పన్నుంటుంది.