హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పనులు అక్టోబర్ వరకు పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు.
టెండర్ పనులు ఖరారైన మరో 137 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించి ఏడాదిలోగా పూర్తిచేయాలని, తద్వారా మొత్తం 504 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చేలా చూడాలని సూచించారు. . సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో అలసత్వాన్ని సహించేది లేదని, పనులు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఏజెన్సీలను, పర్యవేక్షక అధికారులను హెచ్చరించారు.