Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) భారత విపణిలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఉదయం ముంబై (Mumbai) నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా తన తొలి షోరూంను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది.
ఈ షోరూం కోసం బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకుంది. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్కుగానూ కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె (Monthly Rent) చెల్లించనున్నారని తెలిసింది. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కూడా టెస్లా జమ చేసినట్లు సమాచారం.
మరోవైపు తొలిషోరూం కోసం టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర పన్నులు, బీమా కలిపితే రూ. 48 లక్షలపైనే ఉండనుంది. డిమాండ్‌ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ రెండో షోరూంను ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో టెస్లా ఉందని సమాచారం.
Also Read..
X Down | ఎక్స్ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా లాగిన్‌లో సమస్యలు
Bomb Threats | ఢిల్లీలోని ఓ కళాశాల, పాఠశాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు