Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత నెల 15న ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఇప్పుడు రెండో షోరూంను కూడా తెరిచింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో తన సెకెండ్ షోరూంను సోమవారం అధికారికంగా ఓపెన్ చేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో గల ఏరోసిటీ (Aerocity)లో ఓపెన్ చేసింది.
‘Y’ మోడల్ కార్ల అమ్మకాలు..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను (Tesla Y Model) భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది. వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది.
ఈ వాహనాలు చైనాలోని టెస్లా షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి దిగుమతయ్యాయి. ఈ వై మోడల్ వేరియంట్ ధరలు అమెరికాలో 44,990 డాలర్లు (భారత కరెన్సీలో రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్ (రూ.31.57 లక్షలు), జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09 లక్షలు)గా ఉన్నాయి. వీటితో పోలిస్తే భారత్లోనే ఈ వై మోడల్ ధరలు అధికం కావడం గమనార్హం. దిగుమతి సుంకం, లాజిస్టిక్స్ ఖర్చులే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
Also Read..
Viral Video | తనకు ఎదురుపడ్డ సింహాన్నే భయపెట్టిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Akhilesh Yadav | ఢిల్లీలో ఉద్రిక్తత.. బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్