ముంబై, జూలై 15: విద్యుత్‌తో నడిచే వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా తన తొలి మాడల్ ‘వై’ను ఆవిష్కరించింది. రూ.59.89 లక్షల ప్రారంభ ధరతో ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా టెస్లా చీఫ్ ఇసాబెల్ ఫ్యాన్ మాట్లాడుతూ.. కస్టమర్లకు నూతన అనుభవాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ముంబైలో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను నెలకొల్పినట్టు, భవిష్యత్తుతో ముంబైతోపాటు ఢిల్లీలో నాలుగు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.