హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరుకానున్నారు.
తిరిగి ఫిబ్రవరి 1న రాష్ర్టానికి చేరుకోనున్నారు. పెట్టుబడులు ఆకట్టుకోవడమే లక్ష్యంగా తెలంగాణ విజన్-2047ను పెట్టుబడుదారులకు వివరించనున్నారు.