హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఊదరగొడుతుంటే.. వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.8,48, 194 కోట్ల పెట్టుబడుల్ని రాష్ర్టానికి తీసుకొచ్చామని సర్కార్ చెబుతున్నా.. కనీసం అందులో పదో వంతు కూడా ఆచరణీయం కాలేని దుస్థితి నెలకొన్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడుల లెక్కలన్నీ కాగితాలకు పరిమితమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం తప్ప అంతా డొల్లేనని ఆర్థిక రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
తప్పుడు లెక్కలు.. ఎత్తులు
ఇటీవల నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ద్వారా రూ.5.75 లక్షల కోట్లు, దావోస్ పర్యటనల ద్వారా 2024లో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, జపాన్ పర్యటనల ద్వారా మరో రూ.26,962 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రకటించింది. ఇక తాజా దావోస్ పర్యటనతో రూ.28 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నది. ఇలా మొత్తం రూ.8,48,194 కోట్లకు చేరింది. వాస్తవానికి ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చి ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి జెట్ స్పీడ్లో జరగడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేవి. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుని క్రయవిక్రయాలు పెరిగేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న కాకి లెక్కలతో అభివృద్ధి కుంటుబడి ఇతర రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడుల లెక్కలకు, గ్రౌండింగ్ అవుతున్న పెట్టుబడులకు ‘జమాన్ ఆస్మాన్ ఫరక్’ ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారిప్పుడు. తప్పుడు లెక్కలు చెప్పి కేవలం షో ఆఫ్ చేస్తున్నదని వారు మండిపడుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జంబో టీమ్ పర్యటించినా..
ఓవైపు తెలంగాణ రైజింగ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఊదరగొడుతున్నప్పటికీ.. పెట్టుబడిదారులు కాంగ్రెస్ సర్కార్ను ఏమాత్రం నమ్మడం లేదు. దావోస్ వేదికగా ఈ ఏడాది వచ్చిన పెట్టుబడులే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 3 రోజులపాటు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేతలు, అధికారుల జంబో బృందం పర్యటించినా.. ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, 12 మంది పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావే
శాలు నిర్వహించినా ఫలితం శూన్యం.
చంద్రబాబుతో భేటీకే ‘దావోస్’!
ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా తమ రాష్ర్టానికి పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుందని ‘దావోస్’ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. తమ ఐటీ పాలసీలు, కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి ఇన్వెస్టర్లకు వివరించి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ైస్టెలే వేరు.. తన రాజకీయ గురువు చంద్రబాబును కలవడానికే దావోస్ వెళ్లారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు దావోస్లో భేటీ కావడం తెలంగాణకు ద్రోహం చేయడమే అని మండిపడుతున్నారు. రాష్ట్రంలో స్నేహహస్తం కొనసాగిస్తున్న కాంగ్రెస్-బీజేపీలు ఏకంగా దావోస్ వేదికగా మిలాఖత్ కావడం సైతం అనుమానాలకు తావిస్తున్నది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్తో కాంగ్రెస్ మంత్రులు చర్చల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మరి. మంత్రి పొంగులేటి కుమారుడు ఏకంగా మంత్రులతో కూర్చొని కంపెనీల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొనడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి హీరో చిరంజీవిని స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసిమరి దావోస్ పర్యటనకు పిలిపించినా.. పెట్టుబడుల ఆకర్షణలో అది కూడా ప్రభావం చూపలేదని తేలిపోయింది. ఈసారి దావోస్ పర్యటన ముఖ్యమంత్రి పర్సనల్ ఎజెండా అమలుకే జరిగిందని, ఇదో విహార యాత్రేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ.. కాంగ్రెస్ సర్కార్ ప్రచారం దావోస్ పెట్టుబడులు