హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ) : జపాన్‌లోని అయిచీ రాష్ట్రం జపాన్‌తో వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అయిచీ అడ్మినిస్ట్రేవ్ డిస్ట్రిక్ ఆఫ్ జపాన్‌కు చెందిన ప్రతినిధులతో మంత్రి సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయిచీ అసెంబ్లీ సభ్యుడు, ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన హిరోహితో కొండో ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తమ రాష్ట్రంలో జరిగే 20వ ఆసియా క్రీడలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు.