హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): గత నాలుగేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. గురువారం మంత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండియా ల్యాబ్ ఎక్స్పో-2024ను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..లైఫ్ సైన్సెస్, మెడ్ టెక్ స్టార్టప్‌లలో తెలంగాణ వాటా 19 శాతంగా ఉన్నదని, దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ఔషధ, ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 40 శాతంగా ఉండటంతో రాష్ట్రం ఫార్మా తయారీ హబ్‌గా ఎదుగుతున్నదన్నారు. చిన్న, మధ్యతరహ పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉన్నదని, మానవ వనరులకు కొదవే లేదని వెల్లడించారు. జినోమ్ వ్యాలీ నాలుగో దశ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు.