న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.12,075 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.11,909 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 1.39 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 2.39 శాతం అధికమై రూ.65,799 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.11 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్‌వో కున్నుమల్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో 6 వేల మంది సిబ్బందిని తొలగించడం జరిగిందన్నారు.