ముంబై, సెప్టెంబర్ 2: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. 4.5 శాతం నుంచి 7 శాతం వరకు వేతన పెంపును అమలులోకి తీసుకొచ్చింది. అత్యధిక మంది ఉద్యోగుల వేతనాలు పెంచినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ విషయంపై ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది. ప్రస్తుత నెల నుంచే పెరిగిన వేతనాలు అమలులోకి వచ్చాయని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉండటంతో గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన వేతన పెంపు ఎట్టకేలకు అమల్లోకి వచ్చాయి.