Tata Safari – Harrier | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తన కార్ల సేల్స్ పెంచుకోవడంపై దృష్టిని కేంద్రీకరించింది. అందులో భాగంగా పాపులర్ ఎస్యూవీ కార్లు టాటా సఫారీ (Tata Safari), టాటా హారియర్ (Tata Harrier)పై ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ఇటీవలే న్యూ-ఏజ్ టాటా సఫారీని ఆవిష్కరించింది. ఈ డిస్కౌంట్లు ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉంటాయని తెలిపింది.
టాటా సఫారీ (Tata Safari)పై గరిష్టంగా రూ.1.65 లక్షల వరకూ డిస్కౌంట్ ప్రకటించింది టాటా మోటార్స్ (Tata Motors). టాటా హారియర్ (Tata Harrier) మీద రూ.1.45 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్లలో వేరియంట్ల వారీగా తేడాలు ఉంటాయి. టాటా సఫారీ (Tata Safari), టాటా హారియర్ (Tata Harrier) కార్ల ధరలు రూ.16.19 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.14.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతున్నాయి.
రెండు కార్లు (టాటా సఫారీ, టాటా హారియర్) 2.0 లీటర్ల కైర్యోటిక్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా టార్క్ కన్వర్టర్ యూనిట్ తో వస్తున్నాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 168 బీహెచ్పీ విద్యుత్, 350 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. రెండు కార్ల క్యాబిన్లు, ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్లు ఒకేలా ఉంటాయి. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎస్యూవీ – కూపే కారు టాటా కర్వ్, టాటా కర్వ్.ఈవీ కార్లను ఈ నెల ఏడో తేదీన ఆవిష్కరించనున్నది. టాటా కర్వ్ కారు లగ్జరీ కార్ల సెగ్మెంట్లోకి వస్తుందని భావిస్తున్నారు.