Tata Punch Facelift | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) సబ్ -4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో రెండు మోడల్ కార్లు.. నెక్సాన్ (Nexon), పంచ్ (Punch) ఆవిష్కరించి వేవ్ సృష్టించింది. 2021 అక్టోబర్లో ఆవిష్కరించిన టాటా పంచ్ (Tata Punch) ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో- ఎస్యూవీ కారుగా నిలిచింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లను మించి ప్రజాదరణను సొంతం చేసుకున్నదీ టాటా పంచ్. కస్టమర్లకు చేరువయ్యేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ టాటా మోటార్స్ (Tata Motors) వదులుకోవడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూ పంచ్.ఈవీ (Tata Punch.ev) కారును ఆవిష్కరించింది. తాజాగా టాటా పంచ్ కారును ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) వర్షన్ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ (Tata Punch Facelift) తీసుకొస్తోంది.
2023-24లో ఎస్యూవీ కార్ల విక్రయాల్లో టాటా నెక్సాన్ తర్వాతీ స్థానం టాటా పంచ్దే హవా. టాటా పంచ్ 1,70,076 కార్లు విక్రయిస్తే, టాటా నెక్సన్ 1,71,697 యూనిట్లు విక్రయించింది. ఎస్ యూవీ యేతర కార్లలో రోజురోజుకు పాపులారిటీ పుంజుకుంటున్నది టాటా పంచ్.. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే 56,345 యూనిట్లు టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. దీంతో తొలి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే.
తాజాగా మార్కెట్లో ఉన్న టాటాపంచ్.ఈవీ కారులో మాదిరిగా హెడ్ లైట్స్, అప్ డేటెడ్ గ్రిల్లెతోపాటు న్యూ ఫ్రంట్ ఫేసియా, న్యూ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఓల్డ్ 7-అంగుళాల హర్మాన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, న్యూ 10.25 అంగుళాల హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, న్యూ టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ కారులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటాయి. టాప్ హై ఎండ్ వేరియంట్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఫీచర్లు జత చేశారు. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 88 పీఎస్ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సీఎన్జీ ఆప్షన్ ఇంజిన్ గరిష్టంగా 73 పీఎస్ విద్యుత్, 103 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, సీఎన్జీ యూనిట్ లో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లలో వస్తుందని భావిస్తున్నారు. టాటా పంచ్ కారు ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య లభిస్తుంది. టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ రూ.6.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
Xiaomi SU7 EV | త్వరలో భారత్ మార్కెట్లోకి షియోమీ సెడాన్ ఎస్యూ7 ఈవీ.. గేమ్ చేంజర్ అవుతుందా..?!
ITR Filing | తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే ఈ టిప్స్ అనుసరిస్తే సరి..!
CRISIL- Crude Oil | క్రూడ్ ధరతో ప్రభుత్వ ఖజానాపై ద్రవ్యలోటు భారం తప్పదా.. క్రిసిల్ ఆందోళన