Tata Nexon iCNG | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. తన టాటా నెక్సాన్ ఐసీఎన్జీ (Tata Nexon iCNG) కారును 2024- భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించింది. త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. సీఎన్జీ ఆప్షన్లో రావడంతో కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో గేమ్ చేంజర్ కానున్నది. టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న తొలి సీఎన్జీ ఆప్షన్ కారుగా టాటా నెక్సాన్ నిలువనున్నది. ఆరు లేదా ఎనిమిది నెలల్లో భారత్ మార్కెట్లోకి రానున్నది. డీజిల్ ఇంజిన్లతో ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే మున్ముందు సీఎన్జీ ఆప్షన్ కార్లు మార్కెట్లో గణనీయ వాటా పొందుతాయని టాటా మోటార్స్ భావిస్తోంది. సేఫ్టీ రీత్యా టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ఆప్షన్ కారులో సీఎన్జీ పవర్ ట్రైన్ ఉంటుంది. సీఎన్జీ రీఫ్యుయలింగ్ సమయంలో ఆటోమేటిక్‌గా ఇంజిన్ ఆగిపోతుంది.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ (Tata Nexon iCNG) కారు 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. సీఎన్జీ ఫ్యుయల్ కెపాసిటీ ఎంత అన్నది టాటా మోటార్స్ వెల్లడిచంలేదు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో టర్బో చార్జర్-సీఎన్జీ టెక్నాలజీ కాంబినేషన్ అందుబాటులో లేదు. సంప్రదాయంగా నేచురల్లీ ఆస్పిరేటెడ్ సీఎన్జీ ఆప్షన్ కార్లు ఉన్నాయి.
1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ విత్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కిట్‌తో వస్తున్న మారుతి సుజుకి బ్రెజా సీఎన్జీ కారుతో టాటా నెక్సాన్ సీఎన్జీ కారు పోటీ పడుతుంది. మారుతి సుజుకి బ్రెజా సీఎన్జీ కారు ఇంజిన్ గరిష్టంగా 87 బీహెచ్పీ విద్యుత్, 121 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. టాటా నెక్సాన్ ఐసీఎన్జీ టర్బో చార్జ్డ్ ఆప్షన్‌తో పోలిస్తే సీఎన్జీ ఆప్షన్ డిస్ అడ్వాంటేజ్ కలిగి ఉంటుంది. టాటా నెక్సాన్ ఐసీఎన్జీ కారులో ట్విన్ సిలిండర్ సీఎన్జీ సెటప్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్రెజా సీఎన్జీ కారుతో పోలిస్తే టాటా నెక్సాన్ ఐసీఎన్జీ కారులో సుమారు 230 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.