ముంబై, జూన్ 15: ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్కి చెందిన ఎస్యూవీ నెక్సాన్ మరో మైలురాయిని అధిగమించింది. దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చి ఏడేండ్లు పూర్తైన సందర్భంగా ఈ వాహనంపై ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 2017 నుంచి 2024 వరకు ఏడేండ్లలో ఏడు లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ అధికారి వివేక్ శ్రీవాత్సవ తెలిపారు. డిజైనింగ్, భద్రత, కంఫర్ట్, సులభంగా డ్రైవింగ్ చేసే వీలుగా డిజైనింగ్ చేయడం వల్లనే ఈ మాడల్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.