న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ కూడా తన కమర్షియల్ వాహన ధరలను 2 శాతం వరకు పెంచబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల ట్రక్కులు, బస్సుల ధరలను సవరిస్తున్నట్లు తెలిపింది.
ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే వీటి ధరలు పెంచాల్సి వస్తున్నదని పేర్కొంది. ఆయా మాడళ్లు బట్టి బస్సులు, ట్రక్కులు మరింత ప్రియంకానున్నాయని వెల్లడించింది.