ముంబై, జూన్ 7: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..మాన్సూన్ ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఈ నెల 20 వరకు ఉచితంగా వాహనాలను చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 500 నగరాల్లో 1,090కి పైగా ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌లలో తమ వాహనాలను ఉచితంగా చెక్ చేసుకోవచ్చునని సూచించింది. వాహనానికి సంబంధించి 30 క్రిటికల్ ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చును.