ముంబై, మే 4: టాటా మోటర్స్ మరో ఈవీ మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. గతంలో విడుదల చేసిన కర్వ్ సిరీస్‌లో భాగంగా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ మాడల్‌ను తీసుకొచ్చింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.16.99 లక్షలుకాగా, గరిష్ఠ ధర రూ.19.25 లక్షలుగా నిర్ణయించింది.
దీంట్లో 55 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 502 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. నయా టెక్నాలజీతో తయారైన ఈ కారు లెవల్ 2 అడాస్‌తో కలుపుకొని 20 కొత్త ఫీచర్లు, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్‌తో పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.